- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Asaduddin: అసదుద్దీన్ ఓవైసీ నివాసంలో కులగణన పూర్తి
దిశ, వెబ్ డెస్క్: అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) నివాసంలో అధికారులు కులగణన(Caste Census) పూర్తి చేశారు. తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుల గణన కార్యక్రమం(Comprehensive Caste Census Program) విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు(Enumerators) రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో పలువురు ప్రముఖులు కులగణనకు సహకరిస్తూ తమ వివరాలు అధికారులకు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా తమ వివరాలను ఎన్యూమరేటర్లకు అందజేశారు. వివరాల నమోదు ప్రక్రియలో భాగంగా కులగణన సిబ్బంది రాజేంద్రనగర్ సర్కిల్ శాస్త్రిపురంలోని ఓవైసీ నివాసానికి వెళ్లారు. దీంతో అసదుద్దీన్ ఓవైసీ తమ కుటుంబ సభ్యుల వివరాలను కులగణన సిబ్బందికి అందజేశారు. దీంతో ఓవైసీ నివాసంలో వివరాల నమోదు ప్రక్రియ పూర్తి అయ్యింది.