బాలకృష్ణ వచ్చి వెళ్లగానే జూనియర్ NTR ఫ్లెక్సీల తొలగింపు కలకలం

by Sathputhe Rajesh |   ( Updated:2024-01-18 04:54:04.0  )
బాలకృష్ణ వచ్చి వెళ్లగానే జూనియర్ NTR ఫ్లెక్సీల తొలగింపు కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ ఘాట్‌లో బాలకృష్ణ వచ్చి వెళ్లగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం కలకలం రేపింది. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు కాసేపటి క్రితం హీరో, టీడీపీ హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వచ్చి వెళ్లారు. అయితే బాలకృష్ణ వచ్చి వెళ్లగానే జూనియర్ ఎన్టీఆర్ పేరిట వెలసిన ఫ్లెక్సీలను తొలగించడంతో మరో సారి జూనియర్ ఎన్టీఆర్ వార్తల్లో నిలిచినట్లయింది. అయితే ఇటీవల చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. దీంతో అప్పటి నుంచి చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరిగిందనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వాదనకు బలం చేకురేలా బాలకృష్ణ రావడంతోనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడంతో టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య దూరం పెరుగుతోందా అనే చర్చ మొదలైంది.

Read More..

Breaking News: ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన వారసులు

Advertisement

Next Story

Most Viewed