- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దారి దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్
by GSrikanth |

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: సంచలనం సృష్టించిన దారి దోపిడీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణపేట్‌కు చెందిన నగల వ్యాపారి శివ ఆరు రోజుల క్రితం బస్సులో హైదరాబాద్ బయలుదేరాడు. కాగా, బస్సు శివరాంపల్లి వద్దకు రాగానే ఇద్దరు యువకులు బైక్‌ను అడ్డం పెట్టి బస్సును ఆపారు. లోపలికి వచ్చి కత్తులతో శివను బెదిరించి పది లక్షలు దోచుకుని ఉడాయించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వీరిలో ఒకడు నారాయణపేట్‌కు చెందిన వ్యక్తి ఉన్నాడు. అతను శివ కదలికలపై కొంతకాలంగా నిఘా పెట్టినట్టు వెళ్లడయ్యింది. శివ నగదుతో బయలుదేరగానే హైదరాబాద్‌లో ఉంటున్న తన స్నేహితులకు సమాచారం ఇచ్చి దోపిడీ జరిపించినట్టు తేలింది.
Next Story