Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం.. అల్లు అర్జున్ బౌన్సర్ అరెస్ట్

by Shiva |   ( Updated:2024-12-24 08:53:41.0  )
Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం.. అల్లు అర్జున్ బౌన్సర్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2 (Pushpa-2) మూవీ విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ (RTC Cross Roads)లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట (Stampede) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్ ఆంటోనీ (Antony)ని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు తొక్కిసలాటకు మూల కారణం అతడేనని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ కేసులో A11గా అల్లు అర్జున్ (Allu Arjun) ఇటీవలే జైలుకు వెళ్లి బెయిల్‌ (Bail)పై బయటకు వచ్చారు. తాజాగా, సోమవారం పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న ఆయన ఇవాళ విచారణకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వెళ్లారు. అక్కడ సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ (Akshansh Yadav) ఏసీపీ రమేష్ (ACP Ramesh), సీఐ రాజు (CI Raju) ఆధ్వర్యంలో, అల్లు అర్జున్ (Allu Arjun) అడ్వొకేట్ అశోక్‌ రెడ్డి (Advocate Ashok Reddy) సమక్షంలో విచారణ కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed