BRSకు మరో బిగ్ షాక్.. గంటల వ్యవధిలో కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-13 07:23:51.0  )
BRSకు మరో బిగ్ షాక్.. గంటల వ్యవధిలో కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తప్పడం లేదు. కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా, శనివారం గ్రేటర్ పరిధి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన ఆయనకు ముఖ్యమంత్రి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. కాగా, శుక్రవారం రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా గంటల వ్యవధిలో అరికెపూడి గాంధీ హస్తం గూటికి చేరడం సంచలనంగా మారింది.

మరోవైపు గ్రేటర్ పరిధిలోని మిగతా ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతున్న వేళ ఎప్పుడు ఎవరూ కాంగ్రెస్ పార్టీలో చేరతారనేది సస్పెన్స్‌గా మారింది. ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. ఇప్పటికే కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ కుమార్, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్‌లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed