ప్రజలు తిరగబడితే మోడీ, అమిత్ షాలు ఔట్: అనిల్ కుమార్

by Disha Web Desk 19 |
ప్రజలు తిరగబడితే మోడీ, అమిత్ షాలు ఔట్: అనిల్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలు తిరగబడితే మోడీ, అమిత్ షాలు ఔట్ అని మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బంగాళాఖాతంలోకి మునిగిపోవడం ఖాయమన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో రిజర్వేషన్లు ఉండకూడదనేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అన్నారు. మండల్ కమిషన్ బిల్‌ని వీపీ సింగ్ ప్రభుత్వం ప్రవేశపెడితే బీజేపీ కమండల్ యాత్ర చేసిందన్నారు. రిజర్వేషన్ గురించి బీజేపీ నాయకుల మాటలను బేస్ చేసుకొని మాత్రమే రేవంత్ రెడ్డి విమర్శించారని గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని, దీన్ని గమనించిన రాహుల్ గాంధీ కుల గణన చేపట్టి దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చాడన్నారు.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాహుల్ గాంధీ వద్దు అనలేదన్నారు. దానిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చోటు కల్పించమని మాత్రమే చెప్పడన్నారు. అది జీర్ణించుకోలేని మోడీ ప్రభుత్వం తమ నాయకులపై అక్రమ కేసులు పెడుతుందన్నారు. ఎన్ని కేసులు అయినా పెట్టుకోని అని, తాము భయపడేది లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు తరహాలోనే దేశంలోనూ కాంగ్రెస్ పవర్‌లోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాంగ్రెస్‌కు అండగా ఉంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి, స్పోక్స్ పర్సన్ లింగం యాదవ్, కమల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed