- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పరీక్ష రాస్తుండగానే ఇంటర్ విద్యార్థినికి గుండె పోటు..

X
దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్ పరీక్ష రాస్తుండగానే ఓ విద్యార్థిని గుండెపోటుకు గురైంది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ ఇంటర్ విద్యార్థిని గురువారం మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో పరీక్ష రాస్తోంది. ఈ సమయంలోనే విద్యార్థిని గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురి అయ్యింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది హుటాహుటిన విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. కూతురు గుండెపోటుకు గురైందనే వార్త తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story