- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐటీ అడుగులు అమీర్ పేట నుంచే.. సాకారమవుతున్న సాఫ్ట్‌వేర్ కొలువుల కలలు
సాఫ్ట్వేర్ఉద్యోగాలు, ఆరంకెంల జీతం కోసం కలలు కనే ప్రతి యువతకు దారిచూపుతున్నది అమీర్‌పేట్. ఐటీ పరిశ్రమలో అడుగుపెట్టాలంటే ముందుగా అమీర్‌పేట్‌లో ఓనమాలు నేర్చుకోవాల్సిందే అన్నంతగా పేరుగాంచింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలసంఖ్యలో యువత తమ బంగారు భష్యత్తుకు బాటలు వేసుకునేందుకు అమీర్పేట్బాట పడతారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరనికి శివారు ప్రాంతంగా పిలుచుకునే అమీర్‌పేట్ ప్రాంతం ప్రస్తుతం హార్ట్ఆఫ్ద సిటీగా రూపాంతరం చెంది లక్షలాది మంది యువతకు దారి చూపించే మార్గదర్శిగ మారింది. డిగ్రీ నుంచి బీటెక్, ఎంటెక్, ఎంసీఏ ఎవరి విద్యార్హతలకు అనుగుణంగా వారు కంప్యూటర్ కోర్సులను ఎంపిక చేసుకుంటున్నరని నిపుణులు పేర్కొంటున్నారు.
- మొహమ్మద్ అబ్దుల్కరీమ్
సాఫ్ట్వేర్అక్షరభ్యాసం
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలమంది యువతకు అమీర్పేట్మైత్రివనంలో సాఫ్ట్‌వేర్‌లో ఓనమాలు నేర్చుకుంటారు. సాఫ్ట్వేర్రంగంలో ఏ కొత్త కోర్సు, ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే సెంటర్అమీర్పేట్. రెండు గదుల నుంచి నాలుగు నుంచి ఐదు సెంటర్లలో శిక్షణ ఇచ్చే ఇనిస్టిట్యూట్లు అమీర్‌పేట్‌లో ఉన్నాయి. పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ఫీజులు ఉండటంతో ప్రతి ఒక్కరూ అమీర్‌పేట్‌ను ఎంచుకుంటున్నారని విద్యార్థుల చెబుతున్నారు.
కేరాఫ్అడ్రస్ అమీర్‌పేట్
రెండు దశాబ్దాల క్రితం నగరానికి శివారు ప్రాంతంగా పిలుచుకునే అమీర్‌పేట్ ప్రస్తుతం నగరానికి నడి బొడ్డున అన్ని రంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. వందల సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టిట్యూట్‌లతో పాటు ఇక్కడ అనేక హార్డ్వేర్ఇన్స్టిట్యూట్లు అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు స్టార్ట్‌ఫోన్‌ల సర్వీసింగ్, మెకానిజం, రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న మొబైల్ టెక్నాలజీని అరచేతిలో అందించే కేంద్రాలు సైతం ఇక్కడ ఉన్నాయి. అమీర్‌పేట్‌లో సాఫ్ట్‌వేర్ కోర్సులు నేర్చుకునే విద్యార్థులకు తక్కువ ధరలకు సెకండ్హ్యాండ్ల్యాప్టాప్లు సైతం అందుబాటులో ఉంటున్నాయి. ఇదేవిధంగా సాఫ్ట్‌వేర్ కోర్సులకు సంబంధించి మెటీరియల్ఇక్కడ తప్ప నగరం మొత్తం వెతికినా ఎక్కడా ఇంత విస్తృతస్థాయిలో లభ్యం కాదు.
అమీర్‌పేట్‌లో వివిధ కోర్సులు:
సాఫ్ట్వేర్రంగంలో రాణించడానికి సాఫ్ట్‌వేర్ కోర్సులు నేర్చుకునే వారికి ఆరు నెలల కాల వ్యవధిలో అనేక కోర్సులను ఇక్కడి కోచింగ్‌సెంటర్లు అందిస్తున్నాయి.
- ఫ్రెషర్స్ డిగ్రీ, బీటెక్ పూర్తి చేసుకున్న వారు ముఖ్యంగా జావా, పైథాన్, మెర్న్స్టాక్, డాట్నెట్, డాటా సైన్స్, మెడికల్కోడింగ్, సేల్స్‌ఫోర్స్, బిజినెస్ అనలిస్ట్, టెస్టింగ్వంటి కోర్సుల్లో చేరుతున్నారు.
- ఎక్స్పీరియన్స్ఉన్నవారు ముఖ్యంగా జీసీపీ, ఏడీఎఫ్, మల్టీ క్లౌడ్, టెస్టింగ్ వంటి నాలుగు నెలల కాల వ్యవధిలో ఉండే కోర్సుల్లో చేరుతున్నారు.
ఆన్లైన్కోచింగ్కే ప్రాధాన్యత
భారతదేశంలో కరోనా వ్యాప్తి ప్రారంభం అనంతరం అనేక రంగాలు కుదేలయ్యాయి. ఇందులో ప్రధానంగా విద్యాసంస్థలు ఉన్నాయనే చెప్పవచ్చు. ముఖ్యంగా అమీర్‌పేట్‌లోని సాఫ్ట్వేర్ఇన్స్టిట్యూట్లపై కరోనా ప్రభావం ఎక్కువగానే పడింది. రోజు సాధారణంగా ఇన్స్టిట్యూట్కు వచ్చే విద్యార్థుల కన్నా ఎక్కువ శాతం ఆన్‌లైన్‌లో జూమ్ తోనే తరగతులు నిర్వహిస్తున్నామని కల్యాణ్ ఐటి హబ్ నిర్వాహకులు కల్యాణ్, క్వాలిటీ థాట్స్ఇన్స్టిట్యూట్హెచ్ఆర్ దివ్య తెలిపారు.
విద్యార్థులను ఆకట్టుకునేందుకు వినూత్న ప్రచారాలు
సాఫ్ట్వేర్కోర్సులలో చేరాలనుకునే విద్యార్థులను ఆకట్టుకునేందుకు కోచింగ్సెంటర్ల నిర్వాహకులు వినూత్న రీతిలో ప్రచార బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. అమీర్పేట్సెంటర్కు వెళితే చాటు రోడ్డు పొడవునా వేలసంఖ్యలో బోర్డులు, హోర్డింగ్కనిపిస్తాయి. ఆదిత్య ఎన్క్లేవ్అపార్ట్మెంట్ భవనం కూడా కనిపించనంతగా బోర్డులతో కప్పేసి ఉంటుంది.
అమ్మమ్మ కష్టానికి ఫలితం తీసుకువస్తా..
మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నరసరావు పేట అమ్మ, నాన్న లేరు అమ్మమ్మ చదివిస్తుంది. బీటెక్ పూర్తి చేసుకున్నాను. నగరంలో హాస్టల్లో ఉంటు అమీర్‌పేట్‌లో సాఫ్ట్‌వేర్ కోర్సులు నేర్చుకునేందుకు వచ్చాను. మల్టినేషనల్ కంపెనిలో మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి, అమ్మమ్మ కష్టానికి ఫలితం తీసుకు రావాలన్నదే నా ఆశా.
- ఏ. జగదీష్, కంప్యూటర్ కోర్సు విద్యార్థి
అమీర్పేట్బెస్ట్ప్లేస్
మాది నల్గొండ జిల్లా దోమలపుడి గ్రామం. ఈ ఏడాది బీటెక్ పూర్తి చేసుకున్నాను. సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడాలని అనుకుంటుండగా మా సీనియర్స్లు అమీర్‌పేట్‌లో కోచింగ్ బాగుంటుంది, ప్లేస్మెంట్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పడంతో ఇక్కడ జాయిన్ అయ్యాను. తక్కువ ఫీజుతో పాటు మంచి కోచింగ్ కావాలంటే అమీర్‌పేట్ బెస్ట్ ప్లేస్.
-సింగం నవీన్, జావా విద్యార్థి
కోచింగ్‌తో జాబ్గ్యారంటీ
మాది నల్గొండ జిల్లా గత రెండు నెలలుగా ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నా. మంచి సాఫ్ట్‌వేర్ కంపెనిలో ఉద్యోగం చేయలన్నది నా కోరిక. ఈ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న మా సీనియర్లకు మంచి కంపెనిలలో ప్లేస్మెంట్ వచ్చింది. కోచింగ్ తీసుకోవడానికి, మంచి మెటీరియల్ దొరకాలన్న అమీర్‌పేట్ బెస్ట్ ప్లేస్ అని ఇక్కడ జాయిన్ అయ్యాను.
-ఎస్. ఉదయశ్రీ, జావా కోర్సు విద్యార్థిని
బెస్ట్కోచింగ్సెంటర్లు ఇక్కడే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా అవనిగడ్డ. ఈ ఏడాది ఎంసిఏ పూర్తి చేసుకున్న, గత నాలుగు నెలలుగా టెస్టింగ్ టూల్స్ కోచింగ్ తీసుకుంటున్న, సఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడి ఆరు అంకెల జీతం తీసుకోవాలన్నదే టార్గెట్ పెట్టుకున్న. కోచింగ్ పూర్తి అయిన వెంటనే ప్లేస్మెంట్లు కూడా ఇప్పిస్తున్నారని ఇక్కడ కోచింగ్ కోసం వచ్చాను.
-ఎన్.సాయి వికాస్, టెస్టింగ్ టూల్స్ కోర్సు విద్యార్థి
బేసిక్స్ నుంచి శిక్షణ ఇస్తాం
విద్యార్థులకు అవసరం ఉన్న మేరకు కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెషర్స్ అయితే బేసిక్స్నుంచి శిక్షణ నిర్వహిస్తాం. కోర్సులను బట్టి కాల పరిమితి ఉంటుంది. 4 నెలల నుంచి 6 నెలల వరకు శిక్షణ ఉంటుంది. ప్రతి రోజు 6 గంటలు అందులో 2 గంటలు టెక్నికల్, 2 గంటలు ప్రాక్టీస్, ఒక గంట అప్టిట్యూడ్, ఒక గంట కమ్యూనికేషన్ తరగతులు నిర్వహిస్తాం.
-దివ్యా రామ్, హెచ్ఆర్, క్వాలిటీ థాట్స్ కోచింగ్ సెంటర్