Ambati Rayudu: MLA కౌశిక్ రెడ్డి అభ్యర్థనను తిరస్కరించిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ..!

by Maddikunta Saikiran |
Ambati Rayudu: MLA కౌశిక్ రెడ్డి అభ్యర్థనను తిరస్కరించిన మాజీ క్రికెటర్ అంబటి  రాయుడు ..!
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌కు చెందిన క్రికెటర్ మహ్మద్ సిరాజ్, షూటర్ ఇషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్‌కు 600 చదరపు గజాల ఇంటిస్థలాన్ని కేటాయించడానికి తెలంగాణ మంత్రివర్గం ఇటీవలే అంగీకరించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది.అయితే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మొన్న జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఈ అంశాన్ని లేవనెత్తారు. తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్నిస్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాని, అలాగే వారితో పాటు తెలంగాణకు చెందిన మాజీ క్రికెటర్లు ప్రజ్ఞాన్ ఓఝా, అంబటి రాయుడు, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలకు కూడా ఇంటి స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తిపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తాజాగా 'X' లో స్పందించారు.ఎమ్మెల్యే కౌశిక్ ఈ జాబితాలో తన పేరును కూడా చేర్చడం పట్ల అంబటి రాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా అవసరమేనని, మహ్మద్ సిరాజ్ చేసిన కృషికి గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఇంటి స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.దేశంలో కేవలం క్రికెటర్లకే కాకుండా మిగతా క్రీడాకారులకు అంతే సమానంగా గౌరవం దక్కడం చాలా ముఖ్యమైన అంశమని అంబటి రాయుడు పేర్కొన్నారు.తనకు ఏ ప్రభుత్వం నుంచి కూడా స్థలం అవసరంలేదని, నేను ఏ ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఏమీ అడగలేదని రాయుడు ట్వీట్ చేశారు. దీంతో రాయుడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయితుంది.

Next Story

Most Viewed