- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘అల్లు అర్జున్ కేసు చాలా చిన్నది’.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్పా-2’ (Pushpa-2) ప్రీమియర్ షో (Premiere Show) సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ (RTC Cross Roads)లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటన పై నేడు అల్లు అర్జున్‌ను పోలీసులు విచారిస్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ11 గా ఉన్న అల్లు అర్జున్‌కు సోమవారం సాయంత్రం చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనంగా మారింది.
ఈ క్రమంలో నేడు పోలీసుల విచారణకు హాజరు అయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ(BJP MP) రఘునందన్ రావు(Raghunandan rao) స్పందించారు. అల్లు అర్జున్ కేసు చాలా చిన్నదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. భద్రతా వైఫల్యం ఉన్న విషయాన్ని పక్కనపెట్టి హీరోను మాత్రమే ప్రభుత్వం కారణంగా చూపుతుందన్నారు. ఒక తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం అనేక తప్పులు చేస్తోందని ఆరోపించారు. బన్నీ ప్రెస్‌మీట్ పెట్టడానికి వీలు లేనప్పుడు సీపీ వీడియోలు ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం కక్ష గట్టినట్లు ప్రవర్తించడం సరికాదన్నారు.