కవిత తప్పుదోవ పట్టించేలా జవాబులు చెప్పారు: CBI

by GSrikanth |   ( Updated:2024-04-15 06:25:03.0  )
కవిత తప్పుదోవ పట్టించేలా జవాబులు చెప్పారు: CBI
X

దిశ, వెబ్‌డెస్క్: విచారణకు ఎమ్మెల్సీ కవిత సహకరించడం లేదని సీబీఐ ఆరోపించింది. ఇవాళ్టితో ఆమె కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కీలక తీర్పునిచ్చింది. ఈ నెల 23వ తేదీ వరకు కస్టడీ పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా కవితపై కోర్టులో సీబీఐ కీలక ఆరోపణలు చేసింది. మూడ్రోజుల కస్టడీలో కవిత దర్యాప్తునకు సహకరించ లేదని అన్నారు. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న రూ.14 కోట్లపై తప్పుదోవ పట్టించేలా కవిత జవాబులు చెప్పారని అసహనం వ్యక్తం చేశారు. లేని భూములు ఉన్నట్లుగా చూసి అమ్మకానికి పాల్పడటంపై ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. మాగుంట్ల శ్రీనివాసులు రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్‌లతో మీటింగ్‌లపై ప్రశ్నించినట్లు తెలిపారు. దర్యాప్తును, సాక్షులను కవిత ప్రభావితం చేయగలదు అన్నారు. ఆధారాలను సైతం ధ్వంసం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

Read More: ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్.. ఈనెల 23 వరకు కస్టడీ విధింపు

Advertisement

Next Story