ప్రజలను పాలించలేని పాలకులకు మాకు వద్దు..

by Sumithra |
ప్రజలను పాలించలేని పాలకులకు మాకు వద్దు..
X

దిశ, చింతలమానెపల్లి : ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి నాయకులు ప్రతి ఇంటికి వెళతారు. ఎన్నికలు ముగిసి గెలిచిన తరువాత ఓటర్ల బాధలు పట్టించుకోరు. ప్రజలు, నాయకుల ఇంటి చుట్టు ఎన్ని సార్లు తిరిగినా పట్టింపు లేకుండా వ్యవహరిస్తుంటారు. ప్రజా సమస్యలను, గ్రామసమస్యలను పట్టించుకోకుండా నాయకులు వారి స్వలాభం కోసమే పనిచేస్తూ ఉంటారు. అందుకే కొన్ని గ్రామాల్లోని ఓటర్లకు నాయకులపై వ్యతిరేకత మొదలవుతుంది. దాంతో వారి పనులను, వారి గ్రామాల అభివృద్ది కార్యక్రమాలను స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు.

ఇదే క్రమంలో దహేగాం మండలం పెసరుకుంట, మోర్లిగూడ గ్రామాల ప్రజలు కూడా వారి గ్రామానికి రావడానికి రోడ్లను స్వచ్చందంగా వేసుకుంటున్నారు. ఆ రెండు గ్రామాల మధ్య వెళ్లడానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు బుధవారం రోడ్డును వేసుకోవడం ప్రారంభించారు. ఎన్నిసార్లు పాలకుల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నా పట్టించుకున్న పోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

కనీసం గ్రామ సర్పంచ్ అయినా వారి సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకుపోతాడనుకుంటే పట్టించుకోలేకపోవడంతో ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తో రోడ్డుకు కావలసిన మొరంను తెప్పించుకుని స్వచ్ఛందంగా రోడ్డును వేసి చదను చేసుకుంటున్నారు. గ్రామాల అభివృద్ధికి దృష్టి సారించని, ప్రజలను పాలించలేని పాలకులకు మాకు వద్దు, పాలకులకు సరైన రీతిలో బుద్ది చెప్పుతామని ప్రజలు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed