వైన్స్‌లో దొంగతనం.. రూ. 2 లక్షల 30 వేలు మాయం

by Aamani |
వైన్స్‌లో  దొంగతనం.. రూ. 2 లక్షల 30 వేలు మాయం
X

దిశ, మందమర్రి : మందమర్రి పట్టణం పాల చెట్టు ప్రాంతంలో పావని వైన్స్ లో సోమవారం దొంగ చొరబడి రూ. 2 లక్షల 30 వేలు అపహరించినట్లు వైన్స్ నిర్వాహకులు బండారి సూరిబాబు తెలిపారు. తన కథనం ప్రకారం సోమవారం 10 గంటలకు వైన్స్ ను బంద్ చేసి వర్కర్లు ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. కాగా రాత్రి 11 గంటల 20 నిమిషాల సమయంలో ఇంటి పై భాగం సిమెంట్ రేకులు పగలగొట్టి ఒక అగాంతకుడు లోపలికి ప్రవేశించి క్యాష్ కౌంటర్ లో ఉన్న డబ్బులు పట్టుకెళ్ళినట్లు వివరించారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Next Story

Most Viewed