- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఈ ప్రిన్సిపల్ మాకొద్దు’.. రోడ్డెక్కి న్యాయం చేయండని విద్యార్థినుల వేడుకోలు
దిశ, కాగజ్ నగర్: ఈ ప్రిన్సిపాల్ మాకొద్దంటూ విద్యార్థినిలు రోడ్డెక్కారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినిలు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ఒక్కసారిగా మార్కెట్ ఏరియాలోని వీధుల గుండా పరుగులు పెట్టారు. దీంతో స్థానిక పట్టణవాసులు హాస్టల్లో ఏమి జరిగిందంటూ ఒక్కసారిగా హడలెత్తిపోయారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకున్న విద్యార్థినులు రోడ్డుపై గంట వరకు నినాదాలు చేస్తూ బైఠాయించారు.
దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు స్తంభించిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మమ్మల్ని టార్చర్ పెడుతోన్న ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థినులు భీష్మించుకు కూర్చున్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకొని అక్కడ బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఉదయం నుండి నీళ్లు కూడా తాగకుండా, ఎండలోనే మూడు గంటలు ఉండిపోయారు. కలెక్టర్ వచ్చి న్యాయం చేసేదాకా ఇక్కడ నుండి కదిలేది లేదని.. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలంటూ విద్యార్థులు పట్టుబట్టారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ.. హాస్టల్ ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి ప్రతిరోజు ఇబ్బందులకు గురిచేస్తుందని.. భోజనం మెను ప్రకారం పెట్టడం లేదన్నారు. విద్యార్థులు అనారోగ్యంతో బాధపడిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇంటికైనా పంపించండని రిక్వెస్ట్ చేసిన.. అవసరం లేదంటూ మమ్మల్ని ఏడిపిస్తుందని విద్యార్థులు వారి బాధను చెప్పుకొచ్చారు. వారంలో శుక్రవారం నుండి మంగళవారం దాకా ప్రిన్సిపాల్ హాస్టల్‌కు రావడంలేదని ఆరోపించారు. ప్రిన్సిపాల్ పలు రకాలుగా మమ్మల్ని టార్చర్ చేస్తున్నారని.. ఎట్టి పరిస్థితుల్లో ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.