- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వచ్చేది పాయే.. ఇచ్చేది ఎప్పుడో

దిశ, కుబీర్ : కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు పరేషాన్ లో పడ్డారు. వచ్చేది పాయే.. ఇచ్చేది ఎప్పుడో అన్నచందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల స్థాయిలోనే ఉన్న రేషన్ కార్డులోని పేర్లను తొలగించుకొని కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఒక మండల పరిధిలోని వందల క్వింటాళ్ల బియ్యం నిరుపేదలకు అందకుండా పోయింది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో సుమారుగా 2400 వరకు మీసేవ ద్వారా పేర్లు తొలగించుకునేందుకు తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.
ఒక్కో దరఖాస్తుదారుడు ఇద్దరు, ముగ్గురు పేర్లను డిలీట్ చేయించుకున్నారు. ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే గత నెల ఈ నెల బియ్యాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ యువ వికాసానికి కూడా దరఖాస్తు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఉన్న పేర్లను తొలగించుకొని కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు వెంటనే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని, నష్టపోయిన బియ్యాన్ని కూడా ఇవ్వాలని పేదలు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.