MLA Vedma Bojju Patel : చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలి..

by Sumithra |
MLA Vedma Bojju Patel : చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలి..
X

దిశ, కడెం : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మాసాయిపేట్ గ్రామానికి చెందిన ఓ చిన్నారి ప్రమాదవశాత్తు కాగే నూనెలో పడి తీవ్ర గాయాలపాలైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చిన్నారిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. ఈ సందర్బంగా రిమ్స్ డైరెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి చిన్నారికి మెరుగైన చికిత్సలు అందించి, ప్లాస్టిక్ సర్జరీ చేయాలని సూచించారు. తనవంతుగా 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని చిన్నారి కుటుంబ సభ్యులకు అందజేశారు. వారి వెంట నిర్మల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ రెడ్డి, మండల అధ్యక్షులు తుమ్మల మల్లేష్, నాయకులు కోల శీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed