ఎమ్మెల్యే కోనప్ప డౌన్ డౌన్ అంటే భయపడను..

by Sumithra |
ఎమ్మెల్యే కోనప్ప డౌన్ డౌన్ అంటే భయపడను..
X

దిశ, భీమిని : ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డౌన్ డౌన్ అంటే భయపడనని, కోనప్ప అంటే ప్రజలకు తెలుసు అని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం భీమిని మండలంలోని కేసులాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు, గ్రామపంచాయతీ నూతన నిర్మాణానికి భూమి పూజ, అంగన్వాడి కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. రైతు వేదికలో ఏర్పాటుచేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు గిట్టని వాళ్లు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అని నాపై అవినీతి ఎమ్మెల్యే అని ముద్ర వేస్తున్నారని.

నేను ఎవ్వరికీ భయపడనని రాజకీయం చేయను అని సిర్పూర్ ప్రజలకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అంటే ఏమిటో తెలుసు అని సభ ద్వారా తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధి దూసుకుపోతుందని గతంలో వర్షాకాలం వస్తే గ్రామాల్లో పారిశుధ్యం లోపించి కలరా టైఫాయిడ్ మలేరియా జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడేవారిని కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో డంపింగ్ యార్డ్ ప్రకృతి వనం స్మశాన వాటిక నిర్మించడంతో గ్రామాలు పరిశుభ్రంగా ఉండి రోగాలు దరిచేరకుండా ఉన్నాయని. ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్వాడి గర్భిణీ బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారని కల్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతు బీమా ప్రవేశపెట్టి వ్యవసాయానికి పెట్టుబడిగా 5 ఎకరాలు ఉంటే 25,000 అకౌంట్ లో జమ చేస్తుందని అన్నారు.

గత ప్రభుత్వాల హయాంలో ఎరువులు విత్తనాల రాక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఉమ్మడి ఆదిలాబాద్ లో నేను ధర్నాలో కూర్చొని సమస్య పరిష్కారాలకు కృషిచేసినా ఫలితం లేకుండా ఉండేదని ఇప్పుడు నేరుగా సబ్సిడీలతో ఎరువులు విత్తనాలు రైతులకు పంట పెట్టుబడి అందుతున్నాయని అన్నారు. కేస్లాపూర్ గ్రామం నుండి ఇట్యాల వరకు మెటల్ రోడ్డు కర్జిభీంపూర్ మూడు కిలోమీటర్ల రోడ్డు ట్రావెలింగ్ మెటల్ కు గ్రామస్తులు అడగకముందే ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. ఎక్కడ సమస్యలు ఉన్నాయి అనేది నాకు ఎవ్వరూ చెప్పనవసరం లేదని ప్రజలకు జవాబు దారిగా ఉంటూ బాధ్యతతో పనిచేస్తున్నామని అన్నారు.

భీమిని చిన్న గుడి పేట రోడ్డు కోసం ఈ మధ్యనే ఓ తుపాకి రాముడు బైకులపై ర్యాలీ తీసి కోనప్ప డౌన్ డౌన్ ఈ రోడ్డు మేమే సాధిస్తామని గొప్పలు చెప్పుకోవడం సరియైనది కాదని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉందని ఎంపీ అధికారంలో ఉంటే రోడ్డు కోసం నిధులు తీసుకువచ్చి వాళ్లే పనులు చేపట్టుకోవచ్చు కదా అని మండిపడ్డారు. చిన్న గుడిపేట రోడ్డు కోసం ధర్నా చేసిన వాళ్లే ఆ రోడ్డు చేసుకోవాలని వారికి సూచించారు. నాపై అసత్యపు ఆరోపణలు చేస్తూ ధర్నా చేసిన వారి జాతకాలు తీస్తా అని అన్నారు. ఈ ప్రాంతం వెనుకబడి ఉన్న ప్రాంతం అని అంద్వల్లి బ్రిడ్జి వర్షం కోతకు గురై కూలిపోతే ఎమ్మెల్యే కూలగొట్టాడని ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. బ్రిడ్జి కూలిపోయి గ్రామాల ప్రజలు రాకపోకలు నిలిచి ఇబ్బందులు పడుతుంటే మంత్రి దృష్టికి తీసుకువెళ్లి 15 కోట్ల రూపాయలను మంజూరు చేపించి రాత్రి వాళ్ల పనులు చేపిస్తున్నానని తెలిపారు.

అంతేకాకుండా బిబ్రా నుండి చేడ్వాయి దగ్గర వాగుపై మరో బ్రిడ్జి నిర్మించేందుకు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకువెళ్లాలని త్వరలోనే సమస్యత్మక ప్రాంతాల్లో రోడ్లు వంతెనలు పూర్తి చేసేలా కృషి చేస్తానని అన్నారు. 20 లక్షలతో సీసీ రోడ్డు పనులను ఎంపీపీ సర్పంచులు 20 రోజుల్లో పనులు పూర్తి చేస్తే గ్రామానికి మరిన్ని రోడ్లు మంజూరు చేసేలా చూస్తానని వారికి హామీ ఇచ్చారు. ఐకేపీ ఆధ్వర్యంలో గ్రామైక్య సంఘం వివో అధ్యక్షురాలు విమల అధ్యక్షతన కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ ఉమాభారతి, ఏపీవో భాస్కర్, ఐకెపీ రమేష్, సర్పంచ్ సురేష్, ఎంపీపీ రాజేశ్వరి, భీమిని, దహేగాం జెడ్పీటీసీలు గంగక్క, రామా గౌడ్, వైస్ ఎంపీపీ మధు, బీఆర్ఎస్ నాయకుడు సుదర్శన్ గౌడ్, దహేగాం మండల సర్పంచులు, ఇందూరిభూమన్న, ఎంపీటీసీలు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed