- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంటి వెలుగు కార్యక్రమన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బాల్క సుమన్..
దిశ, రామకృష్ణాపూర్ : రాష్ట్రంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని 20 వార్డులో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమన్ని గురువారం ఎమ్మెల్యే సుమన్ పరిశీలించి వైద్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవలని సూచించారు.
అంధత్వ నివారణకు అందరూ సహకరించాలన్నారు. పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పై బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఇంచార్జ్ గాండ్ల సమ్మయ్య, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ అనిల్ రావు తదితరులు పాల్గొన్నారు.