చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

by Sumithra |   ( Updated:2022-09-26 09:45:01.0  )
చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వకారణమని చెప్పారు. సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. నిర్మల్ పట్టణంలో కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు కోసం ఇటీవలే భూమి పూజ చేశామన్నారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకుని, విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు.

Next Story