గైర్హాజరైన అధికారుల పై చర్యలు ఏవి..

by Sumithra |
గైర్హాజరైన అధికారుల పై చర్యలు ఏవి..
X

దిశ, లోకేశ్వరం: గత సమావేశానికి గైర్హాజరు అయిన అధికారుల పై ఏ విధమైన చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ సభ్యులు పట్టుపట్టడంతో మండల సర్వసభ్య సమావేశం నిలిచిపోయింది. మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం పై అధికారులు నిర్లక్ష్యం వహించడం తగదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమావేశానికి విద్యుత్, అటవీ, విద్యాశాఖ అధికారులు హాజరు కాకపోవడంతో వారు సమావేశానికి హాజరయ్యేంతవరకు సమావేశాన్ని కొనసాగించేది లేదని సభ్యులు పట్టుబట్టారు.

దీంతో వారికి నోటీసులు జారీ చేయడంతో పాటు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామని ఎంపీడీవో తెలపడంతో సభ్యులు గత సమావేశాన్ని కొనసాగించారు. కాగా ఈరోజు నిర్వహించిన సమావేశానికి మళ్లీ విద్యాశాఖ, అటవీశాఖ అధికారులు హాజరు కాకపోవడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యేంత వరకు కొనసాగనిచ్చేది లేదంటూ బైటాయించారు. దీనితో సమావేశం నిలిచిపోయింది.

Advertisement

Next Story