ప్రతి ఒక్కరూ భగత్ సింగ్ అడుగుజాడల్లో నడవాలి..

by Sumithra |   ( Updated:2023-02-26 16:37:51.0  )
ప్రతి ఒక్కరూ భగత్ సింగ్ అడుగుజాడల్లో నడవాలి..
X

దిశ, కాగజ్ నగర్ : ప్రతి ఒక్కరు భగత్ సింగ్ అడుగుజాడల్లో నడవాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం కాగజ్ నగర్ పట్టణంలోని బంధం ఫంక్షన్ హాల్లో ప్రపంచ రెడ్ బుక్ డే ను ఘనంగా నిర్వహించారు. భారత విప్లవ కెరటం భగత్ సింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రజల్లోకి వెళ్లే ప్రణాళికే రెడ్ బుక్ డే అని అన్నారు. కమ్యూనిస్టు మేనిఫెస్టో 175 సంవత్సరాల క్రితం 1848 ఫిబ్రవరి 21న పెట్టుబడిదారీ వ్యవస్థ స్వరూపాన్ని బట్ట బయలు చేసిన పుస్తకం అని, ప్రపంచ శ్రామిక వర్గానికి కార్ల్ మార్క్స్, శ్రీడారిక్ ఎంగేల్సులు ఇచ్చిన సిద్ధాంత ఆయుధం అన్నారు.

పెట్టుబడిదారీ వ్యవస్థ బంధనాల నుండి శ్రామిక వర్గానికి చూపిన విముక్తి మార్గం నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే ఏకైక దిక్సూచి కమ్యూనిస్టు మేనిఫెస్టో అన్నారు. అలాంటి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే రెడ్ బుక్ డేను నిర్వహించారన్నారు. అనంతరం పలు సమస్యలకు సంబంధించిన జీవోలు వచ్చేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివై ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గుడిసెల కార్తీక్, జిల్లా సహాయ కార్యదర్శి దుర్గం రాజ్ కుమార్, గేడం టీకానందు, కె.వి పీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినాకర్, ఉపాధ్యక్షులు ఆత్మకూరి సతీష్, పురుషోత్తం, ఉమెన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు శ్రావణి, తరుతరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed