మద్యం మత్తులో విద్యుత్ శాఖ లైన్మెన్ వీరంగం..

by Sumithra |
మద్యం మత్తులో విద్యుత్ శాఖ లైన్మెన్ వీరంగం..
X

దిశ, కోటపల్లి : కోటపల్లి మండలం దేవులవాడ సబ్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ శాఖ లైన్మెన్ వీరంగం మద్యం మత్తులో హల్చల్ చేశాడు. విద్యుత్ శాఖ లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ మిట్టమధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మద్యం తాగి భీమవరం బస్టాండ్ వద్ద, చర్షి రోడ్డు సమీపంలో వీరంగం చేసి హాయిగా నిద్రలో జారుకున్నాడు. దాంతో స్థానికంగా ఉన్న మహిళలు భయాందోళనకు గురయ్యారు.

సదరు లైన్మెన్ నిద్రలోకి జారుకున్నాక మహిళలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ లైన్మెన్ గతంలో జైపూర్ మండలంలో కూడా విధులు నిర్వహిస్తున్నప్పుడు కూడా మద్యం తాగి విధులు నిర్వహించేవాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని నెలల క్రితం కోటపల్లి మండలం రాంపూర్ బస్టాండ్ వద్ద, సబ్ స్టేషన్ ల వద్ద కూడా చాలాసార్లు తాగి పడుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. ఈ విధంగా మద్యం తాగి ఎల్సీలు తీసుకుంటే కిందిస్థాయి సిబ్బంది పరిస్థితి ఏంటి అని విమర్శలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed