Collector Rajarshi Shah : భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

by Sumithra |
Collector Rajarshi Shah : భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
X

దిశ, ఆదిలాబాద్ : జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రజలకు సూచించారు. ఈ మేరకు ఏదైనా ప్రమాదాలు సంభవించినట్లయితే వెంటనే అధికారులను టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సంప్రదించాలని మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఆయన సూచించారు. ఏ సమయంలో అయినా ఎలాంటి ప్రమాదం తలెత్తినా క్షణాలలో అక్కడకు చేరుకునే విధంగా జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కోరారు. విపత్కర సమయాల్లో సహాయం కోసం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి కలెక్టరేట్ లో 24x7 టోల్ ఫ్రీ కంట్రోల్ రూం నెంబర్ 1800 4251939 పని చేస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కి సమాచారం ఇవ్వాలని కోరారు.

రాగల 24-48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని, ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తినా అధికారులు అక్కడకు చేరుకొని సమస్యను పరిష్కరిస్తారని అన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ఉదయం 6.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు ఖాసిరాం, మహమ్మద్ షఫీ జూనియర్ అసిస్టెంట్, తిరిగి మధ్యాహ్నం 2.00 గంటల నుంచి రాత్రి 10.00 గంటల వరకు సయ్యద్ అనిజ్, ఎన్.అశోక్ జూనియర్ అసిస్టెంట్, రాత్రి 10.00 గంటల నుండి ఉదయం 6.00 గంటల వరకు జి. శుభాష్, డి.లక్ష్మణ్, జూనియర్ అసిస్టెంట్ లను కేటాయించారు.



Next Story