కంటి వెలుగు పరీక్షలపై కలెక్టర్ ఆరా..

by Hajipasha |   ( Updated:2023-01-20 06:39:28.0  )
కంటి వెలుగు పరీక్షలపై కలెక్టర్ ఆరా..
X

దిశ,ముధోల్: బైంసా పట్టణంలోని జూనియర్ కాలేజ్, గణేష్ నగర్‌లో గల కంటి వెలుగు కేంద్రాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బర్కాడే పరిశీలించారు. కంటి వెలుగు కేంద్రాలకు వచ్చిన ప్రజలతో మాట్లాడారు. కంటి సమస్యలుపై ఆరా తీశారు. శిబిరాలలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. నిర్వహణ ఎలా జరుగుతుందని సంబంధిత అధికారులను అడిగి.. తగిలిన సూచనలు సలహాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బైంసా డివిజన్ ఆర్టీవో, బైంసా మండల తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed