- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మండలంలో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్
దిశ, వాంకిడి: జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నారు. జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల వేళ వరుసగా ఆ పార్టీని నేతలు వీడుతున్నారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, ఆ ప్రాంతం ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచ్‌లు రాజీనామా చేయగా... తాజాగా వాంకిడి మండల ఎంపీపీ ముండే విమల బాయి గురువారం బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఆమెతో పాటు ఇద్దరు మాజీ సర్పంచులు, ఓ ఎంపీటీసీ మండల నాయకులతో కలిసి రాజీనామా చేశారు. ఈ మేరకు వారి రాజీనామా లేఖను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పంపించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. ఇన్ని రోజులు పార్టీలో వాంకిడి మండల ప్రజలకు సేవ చేసేందుకు అవకాశాలు కల్పించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. తన రాజీనామా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లూ తనకు పార్టీలో సహకరించిన ప్రతీ ఒక్క పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ బాటలోనే మరికొంత మంది మండలంలోని ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్ లు త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ వీడనున్నట్టు తెలుస్తోంది.