- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి గ్రామంలో అంబేద్కర్, అన్న భావుసాటే విగ్రహాల ఏర్పాటుకు కృషి : ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
దిశ, ఇచ్చోడ : బోథ్ నియోజక వర్గంలోని ప్రతిగ్రామంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్. అంబేద్కర్, సాహిత్య సామ్రాట్ అణా భావుసాటే విగ్రహాల ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఆదివారం ఇచ్చోడలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో ప్రతిష్టించిన అన్న భావుసాటే విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత ఆయన్ని అందరూ సాహిత్య సామ్రాట్, లోక్షహిర్, సాహిత్యరత్న, అన్న భావుసాటే అని ఇలా ఎన్నో పేర్లతో పిలిచేవారని పేర్కొన్నారు.
అన్న బాహుసాటే తన రచనల ద్వారా ప్రజలను ఉత్తేజపర్చిన గొప్ప సంఘసంస్కర్త అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి డా. అంబేద్కకర్ పేరుగా నామకరణం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. దళిత బస్తి కింద దళిత రైతులకు ఉచితంగా 3 ఎకరాల భూమి పంపిణీలో తెలంగాణ రాష్ట్రంలోనే బోథ్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని ఆయన గుర్తు చేశారు. గౌరవ ఈ కార్యక్రమంలో ఇచ్చోడ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి, స్థానిక సర్పంచ్ సునీత, మాజీ ఎంపీపీ దుక్రే సుభాష్ పటేల్, మాజీ కన్వీనర్ మేరాజ్, ఎంపీటీసీ శివకుమార్ రెడ్డి, నాయకులు యూనిస్ అక్బనీ, వెంకటేష్, ముస్తఫా, అన్నా బాహుసాటే కమిటీ సభ్యులు, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.