ఆదివాసీల సంప్రదాయాలు అందరికీ ఆదర్శం కావాలి : ఎమ్మెల్యే కోవ లక్ష్మి

by Aamani |
ఆదివాసీల సంప్రదాయాలు అందరికీ ఆదర్శం కావాలి : ఎమ్మెల్యే కోవ లక్ష్మి
X

దిశ, ఆసిఫాబాద్ : గిరిజన ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలు అందరికీ ఆదర్శం కావాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మంగళవారం నార్నూర్ మండలంలోని ఖాందేవ్ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా తొడసం వంశస్తుల దర్బార్ లో పాల్గొని ఖాందేవ్ దేవతల ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆశించారు, ఆలయం అభివృద్ధి తన వంతు కృషి చేస్తామని చెప్పారు, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తొడసం వంశస్థులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed