- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రంలో రానున్నది బీజేపీ రాజ్యమే : గడ్డం వివేక్ వెంకటస్వామి
దిశ, బెల్లంపల్లి : రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు విసుగుచెందారని ఇక తెలంగాణలో వచ్చేది బీజేపీ రాజ్యమేనని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి మాజీ పార్ల మెంటు సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం రాత్రి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బీజేపీ జిల్లా ప్రదాన కార్యదర్శి మునిమంద రమేష్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు.
కన్నెపల్లి మండల కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీటీసీ ఎం మంగయ్య, నెన్నల మండలం కాంగ్రెస్ నేత కోట రాయలింగులతో సహా 30 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మునిమంద రమేష్ ఆధ్వర్యంలో వివేక్ వెంకటస్వామి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి వివేక్ వెంకటస్వామి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని మోది దేశవ్యాప్తంగా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో ఎంతో ఆదరణ పెరుగుతుందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను అమలు పరుస్తూ ప్రజలకు తిండి లేకుండా చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో బెల్లంపల్లి అసెంబ్లీ నియోజక వర్గంలో బీజేపీ పుంజుకుంటున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు రేవెల్లి రాజలింగు, సబ్బని రాజనర్సు, కోయిల్ కార్ గోవర్దన్, ఎర్కకల శ్రీనివాస్, దూడపాక బలరాం, గోలి శ్రీనివాస్, బాల్మీకి సునీల్, విజయ్ కుమార్, ఎర్కల నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.