Breaking News : నటి కస్తూరి అరెస్ట్

by M.Rajitha |
Breaking News : నటి కస్తూరి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కన్నడ నటి కస్తూరి(Kasturi)ని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలోని హైదరాబాద్ లో కస్తూరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 3న చైన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన నటి.. '300 సంవత్సరాల కిందట ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు.. ప్రస్తుతం మాది తమిళ జాతి అంటున్నారన్నారు. ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరు' అంటూ ద్రవిడ సిద్ధాంత వాదులపై ఆమె మండిపడ్డారు. 'ఇతరుల ఆస్తులను లూటీ చేయొద్దని.. ఇతరుల భార్యలపై మోజుపడొద్దని, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండడంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని' విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, అటు తమిళనాడులోనూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వివాదం ముదురుతుందని గ్రహించిన కస్తూరి బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే నటి వ్యాఖ్యలపై మహాజన సంఘం రాష్ట్ర సభ్యుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా అప్పటి నుంచి కస్తూరి పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్‌ కోసం మద్రాస్‌ హైకోర్టు ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌ను ఏకసభ్య ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా హైదరాబాద్ లోణి గచ్చిబౌలి పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed