FEO: ఫార్ములా ఈ కార్ రేసు లో ఏసీబీ స్పీడ్

by Prasad Jukanti |
FEO: ఫార్ములా ఈ కార్ రేసు లో ఏసీబీ స్పీడ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ( Formula E Car Race) విచారణలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచనున్నారు. ఈ అంశంలో ఈఎఫ్ఓ ను ఏసీబీ మరోసారి విచారణ చేయనున్నది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ కేసులో ఎఫ్ఈవో (FEO) సీఈవోను ఫిబ్రవరి 17న వర్చువల్ గా ఏసీబీ విచారించి కీలక సమాచారం సేకరించింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రశ్నించడం ద్వారా ఎఫ్ఈవోకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మళ్లీంచడంపై ప్రశ్నించనున్నట్లు సమాచారం. అయితే ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR), ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

Next Story