- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అబిడ్స్ సెక్స్ రాకెట్.. రామ్‌నగర్ అఖిల్ పహిల్వాన్ అరెస్ట్

దిశ, డైనమిక్ బ్యూరో: సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం హైదరాబాద్ అబిడ్స్‌లో తనిఖీలు చేయగా.. ఫర్ట్యూన్ హోటల్లో వ్యభిచారం చేస్తున్న ముఠా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తాజాగా మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. రామ్‌నగర్ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో ఈ వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం. అమ్మాయిలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలోనే అఖిల్ పహిల్వాన్‌ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అఖిల్‌తో పాటు 16 మంది అమ్మాయిలు, 4 కస్టమర్స్, 2 ఆర్గనైజర్స్, లాడ్జీ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్దనున్న 22 సెల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుపడిన మహిళలంతా కోల్‌కతా, ముంబాయికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను నిర్వాహకులు హైదరాబాద్‌కు రప్పిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ కేసుపై అబిడ్స్ పోలీస్‌లు విచారణ చేపట్టారు.