Sedans Vs SUVs: బ్యాలెన్స్‌డ్ రైడ్, మైలేజీ బెస్ట్ ఉండాలంటే సెడాన్‌, ఎస్‌యూవీలతో ఏది బెటర్?

by Vennela |
Sedans Vs SUVs: బ్యాలెన్స్‌డ్ రైడ్, మైలేజీ బెస్ట్ ఉండాలంటే సెడాన్‌, ఎస్‌యూవీలతో ఏది బెటర్?
X

దిశ, వెబ్ డెస్క్ : Sedans Vs SUVs: భారత్ లో కార్ల అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(SUV), సెడాన్(Sedans) ల విక్రయాలు కూడా టాప్ గేరులోనే ఉన్నాయి. ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా ఏ రకం వాహనాన్ని కొనాలనేది నిర్ణయించుకుంటారు. ఎస్ యూవీలతో పోలిస్తే మన దేశంలో సెడాన్ రకం కార్ల వినియోగం చాలా తక్కువ. పనితీరు, డ్రైవింగ్ విషయాన్ని చూసినట్లయితే ఎస్ యూవీ(SUV)ల కంటే సెడాన్ (Sedans) లే ముందంజలో ఉన్నాయి. అయినా ఎస్ యూవీలను కొనేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎస్ యూవీ(SUV)ల కంటే సెడాన్(Sedans) కార్లు బెటర్ అని తెలిపే ఐదు కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

డ్రైవింగ్ అనుభవం:

బ్యాలెన్స్డ్ రైడ్ కావాలంటే సెడాన్ (Sedans) లను ఎంచుకోవాలి. వీటిలోని స్టీరింగ్ తో వాహనాన్ని సమర్ధంగా కంట్రోల్ చేసుకోవచ్చు. వాహనంలోని సస్పెషన్ వ్యవస్థ చురుగ్గా ఉంటుంది. ఎక్కువగా మలుపులున్న రూడ్లపైనా సెడాన్(Sedans) తో సాఫీగా డ్రైవింగ్ కూడా చేయవచ్చు. ఎస్ యూవీలలో గురుత్వాకర్షణ కేంద్రం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రోడ్డుపై డ్రైవింగ్ చేసే దిశలో ఆకస్మిక మార్పులు చేస్తే, ఎస్ యూవీని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టంగా మారుతుంది.

పనితీరు:

ఎస్ యూవీల కంటే సెడాన్(Sedans) కార్లు చాలా తేలికగా ఉంటాయి. అందుకే ఇవి మంది స్పీడ్ తో ప్రయాణిస్తాయి. బ్రేకింగ్ వ్యవస్థ కూడా పర్ఫెక్టుగా ఉంటుంది. సెడాలన్స్ కు అత్యల్ప గురుత్వాకర్షణ కేంద్రం ఉంటుంది. దీనితో అతివేగంలోనూ ఇవి రోడ్డుపై అద్భుతమైన గ్రిప్ తో జర్నీ చేస్తాయి. మొత్తం మీద ఎస్ యూవీలతో పోలిస్తే సెడాన్(Sedans) ల పనితీరు బాగుంటుంది.

మైలేజీ:

సెడాన్(Sedans) కార్ల డిజైన్ గాలి ప్రసారం స్వచ్చేగా జరిగేలా ఉంటుంది. ఈ కార్ల బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల మెరుగైన మైలేజీ వస్తుంది. రోజువారీ ప్రయాణం చేసేవారికైనా, దూర ప్రయాణాలు చేసేవారికైనా సెడాన్ కార్లు మంచి మైలేజీతో ఆర్థికంగా లబ్దిని చేకూరుస్తాయి. దీర్ఘకాలంలో ఇవి ఆకర్షణీయమైన ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తాయి.

లగేజీకి చోటు:

ఎస్ యూవీలతో పోలిస్తే సెడాన్(Sedans) కార్లలో లగేజీకి ఎక్కువగా చోటు ఉంటుంది. సెడాన్ వాహనాల బ్యాక్ సైడ్ చివరిలో లగేజీకి ప్లేస్ ఉంటుంది. అందులో మనం పలు రకాల సామాగ్రిని తీసుకెళ్లొచ్చు. ఎస్ యూవీలు, సెడాన్ లు ఒకే సైజులో ఉన్నా..లగేజీకి చోటు అనేది సెడాన్ లలో అదనంగా ఉంటుంది.

ఫ్లెక్సిబులిటీ:

ఎస్ యూవీలతో పోలిస్తే సెడాన్స్(Sedans) ఎక్కువగా సౌకర్యవంతంగా ఉంటాయి. అయినా చాలా మంది ఎస్ యూవీలే బెస్ట్ అనుకుంటారు. ముఖ్యంగా వృద్ధులకు సెడాన్ లలో ప్రయాణం కంఫర్ట్ గా ఉంటుంది. సెడాన్ లోని స్క్రింగ్స్ ఎత్తును 1 అంగుళం నుంచి 2.5 అంగుళాల మేర తగ్గించుకోవచ్చు. ఫలితంగా కారులోకి వృద్ధులు ఎక్కడం, దిగడం అనేది సులభంగా ఉంటుంది. సెడాన్ లలో సుదీర్ఘ ప్రయాణాలు చేసేవాళ్లు కూడా ఈ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.



Next Story

Most Viewed