జస్ట్ మిస్.. ప్రాణాలతో బయటపడ్డ మహిళ.. పరిమితికి మించి బస్సుల్లో ప్రయాణం

by Ramesh N |   ( Updated:2024-02-20 12:08:37.0  )
జస్ట్ మిస్.. ప్రాణాలతో బయటపడ్డ మహిళ.. పరిమితికి మించి బస్సుల్లో ప్రయాణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఈ రద్దీ పెరిగిందని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం బస్సుల సంఖ్యను పెంచింది. అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో రద్దీ మాత్రం అదేవిధంగా కంటిన్యూ అవుతుంది. తాజాగా మేడారం జాతరకు బస్సులు తరలించడంతో సిటీ బస్సులు తక్కువగా నడుస్తున్నాయి. దీంతో సిటీ బస్సుల్లో రద్దీ పెరిగి పరిమితికి మించి బస్సులు ఎక్కుతున్నారు. మహిళలు, స్కూల్ పిల్లలు ప్రమాదకరంగా ఫుట్ బోర్డుపై ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి ప్రయాణంతో ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా సికింద్రాబాద్ పరిధిలోని లోతుకుంట వద్ద ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు ఎక్కువ ఉండటంతో ఎక్కేందుకు పలువురు మహిళలు ప్రయత్నించగా.. ఒక్కసారిగా ముందుకు కదలడంతో ఓ మహిళ అదుపుతప్పి బస్సు కిందపడ్డారు. డ్రైవర్ అప్రమత్తమై నిలిపివేయడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. మరో బస్సుల్లో స్కూల్ పిల్లలు ఫుట్ బోర్డుపై ప్రమాదకరంగా నిలబడి ప్రయాణం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఘటనలపై టీఎస్ ఆర్టీసీ, ప్రభుత్వం పై నెటిజన్లు మండిపడుతున్నారు. తెలంగాణ లో మహిళల దుస్థితి, ఎలా ఉండే ఎలా అయిపోయింది రా బాబూ?, చంపేస్తారా ఏంటీ ఆడపిల్లలను ఇదేనా మార్పు అంటే అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed