ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన ఈ పాట గుర్తుందా? (వీడియో)

by GSrikanth |
ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన ఈ పాట గుర్తుందా? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన ఉద్యమంలో కళాకారులు కీలక పాత్ర పోషించారు. కాలికి గజ్జె కట్టి, ఒంటిమీద గొంగడి వేసి ఊరూరు తిరిగి ప్రజలను చైతన్యం చేశారు. రాజకీయ నాయకుల కంటే చురుగ్గా పాల్గొని ఆంధ్రా పాలకుల వల్ల జరుగుతున్న నష్టం, తెలంగాణ ఏర్పడే వచ్చే లాభం గురించి చక్కగా వివరించి ప్రజలు ఉద్యమంలో పాల్గొనేలా చేశారు. ముఖ్యంగా గద్దరన్న ‘పొడుస్తున్న పొద్దు’ పాటతో పాటు జగపతి బాబు హీరోగా నటించిన ‘జైబోలో తెలంగాణ’ సినిమా ఎంతో ప్రభావం చూపింది. అయితే, తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఉద్యమ గుర్తులను పలువురు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ‘రేలారే రేలారే.. నీళ్లల్లో నిప్పల్లే’ అనే పాట ఏ లెవెల్‌లో ఉర్రూతలూగించిందో గుర్తుచేసుకుంటున్నారు. ‘సరిగమపా’ అనే షోలో చిన్నారి పాడిన పాటను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తున్నారు.

Advertisement

Next Story