- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూప్1 ప్రిలిమ్స్పరీక్షను రద్దు చేయండి.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు ఈనెల 11న నిర్వహించ తలపెట్టిన గ్రూప్1 ప్రిలిమ్స్పరీక్షను రద్దు చేయాలంటూ అభ్యర్థులు కొందరు శుక్రవారం హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. వీటిని విచారణకు స్వీకరించిన కోర్టు వివరణ ఇవ్వాల్సిందిగా బోర్డుకు నోటీసులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ గతంలో నిర్వహించిన గ్రూప్1 ప్రిలిమ్స్, ఏఈఈ సివిల్, జనరల్నాలెడ్జ్, డీఏఓ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకైన విషయం వెల్లడి కావటంతో బోర్డు ఈ పరీక్షలను రద్దు చేసింది. ఆ తరువాత కొన్నిరోజులకు గ్రూప్1 ప్రిలిమ్స్పరీక్షలను ఈనెల 11న నిర్వహించనున్నట్టు బోర్డు ప్రకటించింది. కాగా, దీనిపై ముప్పయి ఆరుమంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. గ్రూప్1 ప్రిలిమ్స:పరీక్షలను కనీసం రెండు నెలలపాటు వాయిదా వేయాలని పిటీషన్లు దాఖలు చేశారు. పరీక్షకు తాము సన్నద్దం కాలేదని కోర్టుకు తెలిపారు.
ఈ పిటీషన్లపై గతనెల 25న విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. కాగా, తాజాగా మరికొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఈనెల 11న నిర్వహించ తలపెట్టిన గ్రూప్ 1 ప్రిలిమ్స్పరీక్షలను రద్దు చేయాలంటూ కోర్టును అభ్యర్థించారు. టీఎస్పీఎస్సీ బోర్డుపై తమకు నమ్మకం లేదని పిటీషన్లలో పేర్కొన్నారు. యూపీఎస్సీ లాంటి సంస్థకు పరీక్ష నిర్వహణ బాధ్యతను అప్పగించాలని కోరారు. ఈ పిటీషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా టీఎస్పీఎస్సీ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 5వ తేదీకి వాయిదా వేసింది.