ఈటలపై ఓయూ పీఎస్​లో ఫిర్యాదు

by Javid Pasha |
ఈటలపై ఓయూ పీఎస్​లో ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​పై వెంటనే క్రిమినల్ కేసు ఫైల్​ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు నమోదైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్​ కాంగ్రెస్​ కు రూ.25 కోట్లు ఇచ్చారని ఈటల రాజేందర్​ తప్పుడు ఆరోపణలు చేశారని, దీన్ని సీరియస్​గా తీసుకొని కేసు నమోదు చేయాలని టీపీసీసీ జనరల్​సెక్రటరీ చరణ్ ​కౌశిక్ ​యాదవ్​ శనివారం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.ఎ లాంటి ఆధారాలు లేకుండా పార్టీలపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.

దీని వలన సుమారు 40 లక్షల మంది కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయని స్పష్టం చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా ఈటల రాజేందర్​ కాంగ్రెస్ పార్టీ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారన్నారు. పార్టీ, కార్యకర్తలను అవమానించినందుకు ఈటల రాజేందర్ పై వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story