HYD : జస్ట్ మిస్.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం!

by M.Rajitha |
HYD : జస్ట్ మిస్.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం!
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని ఎల్బీ నగర్లో ఘోర ప్రమాదం కొద్దిలో తప్పిపోయింది. మన్సూరాబాద్ లో 33 కేవీ విద్యుత్ లైన్ వైర్లు తెగి పడ్డాయి. రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ వైర్లు తెగి పడిన సందర్భంలో అటుగా ఎలాంటి వాహనాలు గాని, పాదాచారులు గాని రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే తేరుకున్న స్థానికులు విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించగా, తక్షణమే విద్యుత్ సరఫరా నిలిపి వేసి ఘటనా స్థలానికి చేరుకొని మరమత్తులు కొనసాగిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed