పల్లవి ప్రశాంత్ కేసులో మరో 16 మంది అరెస్ట్ (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-12-21 12:33:42.0  )
పల్లవి ప్రశాంత్ కేసులో మరో 16 మంది అరెస్ట్ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: బిగ్‌బాస్ సీజన్ -7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను తాజాగా అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు వ్యవహారంలో మరో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో 12 మంది మేజర్లు ఉన్నట్లు గుర్తించారు. వారిని కోర్టులో హాజరు పరిచిన అనంతరం రిమాండ్‌కు తరలిస్తామని అధికారులు తెలిపారు. మిగిలిన నలుగురు మైనర్లను జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరు పరచనున్నారు. కాగా, బిగ్‌బాస్ ఫైనల్స్ సమయంలో అన్నపూర్ణ స్టూడియో వద్ద అభిమానుల వాగ్వాదంతో ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలు, పోలీస్‌ కారుతో పాటు ఇతరుల కార్లు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story