బస్సుల్లో కరోనా నిబంధనలు.. బేఖాతర్

by Shyam |   ( Updated:2020-06-05 02:14:52.0  )
బస్సుల్లో కరోనా నిబంధనలు.. బేఖాతర్
X

దిశ, మెదక్: లాక్‌డౌన్ సడలింపులతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది వలస కూలీలను గమ్యస్థానాలకు చేరుస్తున్న టీఎస్ ఆర్టీసీలో నిబంధనల అమలు మాత్రం ప్రభుత్వం గాలికి కొదిలేసింది. బస్సులు ప్రారంభమైన మొదట్లో భయంతో ఎవరూ బస్సులు ఎక్కకపోవడంతో ఖాళీగా నడిచిన బస్సులు ఇప్పుడు జనాలతో కిక్కిరిసి పోతున్నాయి. భౌతిక దూరం, మాస్క్, శాని టైజర్ లాంటి నియమాల ఊసేలేదు. ఇటీవల ఖమ్మంలో రవాణా శాఖ మంత్రి తనిఖీలు నిర్వహించగా, కోదాడ డిపో బస్సులో శాని టైజర్ లేదని ఓ అధికారిని మంత్రి సస్పెండ్ చేశారు. ఇప్పుడు చాలా బస్సుల్లో నిబంధనలు పాటించడం పక్కన పెడితే.. అసలు బస్సునే శానిటైజ్ చేయడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. భౌతిక దూరం పాటించడం లేదు. బస్సులు సీటుకు ఒక్కరే కూర్చోవాలని చెబుతున్నా ఎక్కడా అమలు కావడం లేదు. చిన్న సీటులో ఇద్దరు, పెద్ద సిటులో ముగ్గురిని కూర్చోబెడుతున్నారు. ఎవరికి ఏ రోగం ఉందో తెలియక బిక్కుబిక్కుమంటూ కూర్చోవాల్సి వస్తుంది అని ప్రయాణికులు అంటున్నారు. మాస్కులు పెట్టుకోవాలని కండక్టర్లు చెబుతున్నా ప్రయాణికులు పెట్టుకోవడం లేదు. శాని టైజర్ వాడడం లేదని వాపోతున్నారు.

Advertisement

Next Story