సెకండ్‌ వేవ్‌పై హెల్త్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2021-04-17 05:12:13.0  )
సెకండ్‌ వేవ్‌పై హెల్త్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సెకండ్ వేవ్ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయంటూ.. ఇందుకు ప్రజల నిర్లక్ష్యమే కారణమంటూ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్.. ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఈ రోజు నమోదైన కేసులు అధికమని చెప్పారు. వైరస్‌ నుంచి ప్రజలు తమను తాము కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం వంద మందిలో 80 శాతం మందికి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ నిర్ధారణ అవడం ఆందోళనకరమని చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత ఉందని.. కేంద్రం నుంచి మరో 2 లక్షల డోసులు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న డోసులు రేపటి వరకు అడ్జస్ట్ చేయొచ్చని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో వచ్చే జూన్ వరకు ప్రజలు వైరస్‌ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని శ్రీనివాస్ హెచ్చరించారు. అయినప్పటికీ వ్యాక్సినేషన్, కొవిడ్‌ చికిత్స కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం 38 వేల 852 బెడ్‌లు సిద్ధంగా ఉన్నాయని.. రానున్న రోజుల్లో 50 వేలకు పెంచుతున్నట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వ చర్యలకు.. ప్రజలు కూడా తమ వంతుగా సహకారం అందించాలని ఈ సందర్భంగా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story