- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అక్కడ బడి గంట మోగేనా.. వారి బతుకులు రోడ్డున పడకుండా ఆగేనా..?
దిశ, తెలంగాణ బ్యూరో: విద్యావాలంటరీలు విధులు నిర్వహించిన పాఠశాలలు తెరుచుకుంటాయా.. లేదా..? అనే సందేహం కలుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 400 ఏకోపాధ్యాయ పాఠశాలలో కేవలం విద్యావాలంటరీలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆ పాఠశాలలో ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారికంగా ఉపాధ్యాయులను నియమించకపోవడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో చాలా వరకు పాఠశాలలో ఇప్పటి వరకు ఎలాంటి పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించలేదు. రాష్ట్రంలో గతేడాది విధులు నిర్వహించిన 11,428 మంది విద్యావాలంటరీలను ప్రభుత్వం ఇప్పటి వరకు విధుల్లో చేర్చుకోలేదు.
మారుమూల ప్రాంతాల్లో, టీచర్ల కొరత ఉన్న పాఠశాలలో ప్రభుత్వం విద్యావాలంటరీల నియామకాలు చేపట్టి విద్యార్థులకు విద్యను అందించే ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఏడాది నోటిఫికేషన్ విడుదల చేసి దాదాపుగా గతేడాది విధులు నిర్వహించిన విద్యావాలంటరీలనే తిరిగి నియామకాలు చేపడుతూ వస్తుంది. కరోనా పరిస్థితులు నెలకొన్నప్పటి నుంచి ప్రభుత్వం ఈ ప్రక్రియకు మంగళం పాడింది. ఈ ఏడాది విద్యావాలంటరీల నియామకం చేపట్టేందుకు ఫిబ్రవరి 15న డీఎస్సీ ప్రోసిడింగ్ నెంబర్ 40 ద్వారా నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. 6 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు నియామకాలు చేపట్టకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 11,428 మంది విద్యావాలంటరీలు ఇప్పటి వరకు విధుల్లో చేరలేదు.
400 స్కూళ్లకు వాలంటీర్లే శరణ్యం..
రాష్ట్రంలో కేవలం విద్యావాలంటరీలతో నడిచిన పాఠశాలలు 400 వరకు ఉన్నాయి. మారుమూల ప్రాంతాలలో, తండాలలో చాలా వరకు ఏకోపాథ్యాయ పాఠశాలలో విద్యావాలంటరీలు మాత్రమే విధులు నిర్వహించారు. ఈ ఏడాది జూలై నుంచి టీచర్లు పాఠశాలలకు హాజరవుతుండటంతో విద్యావాలంటరీలు విధులు నిర్వహించిన ఏకోపాధ్యాయ పాఠశాలలు తెరుచుకోలేదు. ఈ పరిస్ధితులను గమనించిన స్థానిక ఎంఈఓలు అధికారికంగా డీఈఓల నుంచి ఎలాంటి ఆదేశాలులేనప్పటికి ఆ పాఠశాలలకు సిబ్బందిని సర్దుబాటు చేశారు. ఈ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పాఠశాలలోనే జరగడంతో చాలా వరకు మారుమూల ప్రాంతాలు, తండాలలోని పాఠశాలలో ఉపాధ్యాయుల సర్దుబాటు జరగలేదు. దీంతో ఆయా గ్రామాల్లోని తల్లింద్రడులు, విద్యార్థులు పాఠశాల ప్రారంభంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో ఆయా పాఠశాలలో పారిశుద్ధ్య పనులు కూడా జరగలేదు.
2020 మార్చి నుంచి ఉపాధి కోల్పోయిన విద్యావాలంటరీలు..
కరోనా ఫస్ట్ వేవ్ ప్రబలిన క్రమంలో ప్రభుత్వం మొట్టమొదటగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలను మూసివేసారు. 2020 మార్చి 18 నుంచి విద్యా సంస్థలు మూతపడటంతో విద్యావాలంటరీలు అప్పటి నుంచి ఉపాధిని కోల్పోయారు. 2018-19లో హైకోర్టు తీర్పు ప్రకారం పూర్తి స్థాయిలో టీచర్లను నియామకం జరిగేంత వరకు విద్యావాలంటరీలను రిన్యూవల్ చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికి ఈ ఏడాది ఇప్పటి వరకు ఎలాంటి నియమకాలు చేపట్టలేదు. 11 జిల్లాలలోని విద్యావాలంటరీలకు ప్రభుత్వం 3నెలల జీతాలు కూడా చెల్లించకుండా వారిని రోడ్డున పడేసింది. కరోనా సమయంలో ప్రైవేటు టీచర్లకు అందించిన ఆర్థిక సాయం, ఉచిత బియ్యాన్ని కూడా విద్యావాలంటరీలకు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ అందించకుండా నిర్లక్ష్యానికి గురిచేశారు.
విద్యావాలంటరీలను నియమించాలి..
విద్యావాలంటరీల నియమకం చేపట్టకపోవడంతో చాలా వరకు ఏకోపాధ్యాయ పాఠశాలలు తెరుచుకోని పరిస్థితి నెలకొంది. విద్యావాలంటరీలు విధులు నిర్వహించిన ఏకోపాధ్యాపాఠశాలలో ప్రభత్వం అధికారికంగా సిబ్బందిని సర్దుబాటు చేయలేదు. కేవలం ఎంఈఓలు మాత్రమే సొంత నిర్ణయం తీసుకొని ఉపాధ్యాయలను సర్ధుబాటు చేశారు. ఎంఈఓలు చొరవ తీసుకోని ప్రాంతాల్లో పాఠశాలలు తెరుచుకునే పరిస్థితి లేదు, కాబట్టి ప్రభుత్వం వెంటనే విద్యావాలంటరీల నియామకం చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలి– జంగయ్య, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
రోడ్డున పడ్డాము ఉపాధి కల్పించాలి..
ఏడాదిన్నరగా ఉపాధి లేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కేవలం ఉపాధ్యాయ వృత్తిని మాత్రమే నమ్ముకున్న నాలాంటి వారందరు రోడ్డున పడ్డారు. ప్రైవేటు టీచర్లుకు ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయానికి కూడా మేము నోచుకోలేదు. మా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవాలి– పచ్చిపాల రవీందర్, విద్యావాలంటీల కార్యదర్శి, నాగర్ కర్నూల్ జిల్లా
హైకోర్టు తీర్పు ప్రకారం తిరిగి విధుల్లోకి తీసుకోవాలి..
2018-19లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం విద్యావాలంటరీలను ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. 11 జిల్లాల విద్యావాలంటరీలకు పెండింగ్ లో ఉన్న 3 నెలల వేతనాలు చెల్లించాలి. 400 పాఠశాలలో ఏకోపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన తమను ప్రభుత్వం కష్ట సమయంలో రోడ్డున పడేసింది. మారుమూల ప్రాంతాల్లోని, తాండాల్లో విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారికి మెరుగైన విద్యను అందించేందుకు విద్యావాలంటరీలను విధుల్లోకి తీసుకోవాలి– శివానంద్, విద్యావాలంటరీల రాష్ట్ర అధ్యక్షుడు