- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల
దిశ, న్యూస్ బ్యూరో : తెలంగాణ ఈసెట్‌లో ఫలితాలను శుక్రవారం వెలువడ్డాయి. పాలిటెక్నిక్ మూడేండ్ల డిప్లోమా కోర్సు పూర్తిచేసుకొని ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన అర్హత పరీక్షల ఫలితాల్లో మహిళా అభ్యర్థులు పైచేయి సాధించారు. 98.29 శాతం మహిళలే అర్హత సాధించగా.. పురుషులు 63.49 శాతం మాత్రమే అర్హత సాధించారు.
హాజరైన అభ్యర్థుల్లో మొత్తం 90.86 శాతం మంది అర్హతను సాధించారు. ఈసెట్ పరీక్ష కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు మొత్తం 28,041. పురుషులు 20,225, మహిళలు 7,812 మంది మాత్రమే. ట్రాన్స్ జెండర్లు 4. వీరిలో 28,016 మందికి హాల్ టిక్కెట్లు జారీ అయ్యాయి. పరీక్షకు మొత్తం 25,448 మందిగా ఉంటే.. అందులో మహిళలు 7,148, పురుషులు 18,297 మంది, ట్రాన్స్ జెండర్లు 3 హాజరయ్యారు. కాగా, అర్హత సాధించిన వారు మొత్తం 24.832 మంది కాగా మహిళలు 7,026, పురుషులు 17,803, ట్రాన్స్ జెండర్లు 3 ఉన్నారు.