- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘తీన్మార్ మల్లన్నను ఎదుర్కొనే దమ్ము టీఆర్‌ఎస్‌కు లేదు’
దిశ, నల్లగొండ: ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను ఎదుర్కోలేకనే, క్యూ న్యూస్ ఆఫీసుపై టీఆర్ఎస్ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని, ఇలాంటి చర్యలను తాము సహించబోమని తీన్మార్ మల్లన్న టీం నల్లగొండ జిల్లా కన్వీనర్ పి.ధనుంజయ్య హెచ్చరించారు. నల్లగొండ జిల్లా కేంద్రం ఆర్ఎండ్ బీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై పోలీసులు దాడి చేసి ఫర్నీచర్, కంప్యూటర్లను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. హార్డ్ డిస్కులను తీసుకొని, సమాచారం దొంగిలించారని, అప్రజాస్వామిక పద్ధతిలో మల్లన్నను అరెస్టు చేసి భయాబ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.
ప్రజలకు అర్థమయ్యేలా వ్యవస్థపై అవగాహన కల్పిస్తున్న మల్లన్నను ఎదుర్కోలేకనే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న సైనికులు పెద్ద ఎత్తున్న ఉద్యమాలకు సిద్ధమవబోతున్నారని, కేసీఆర్‌కు తీన్మార్ మల్లన్న ద్వారానే గుణపాఠం చెబుతాడన్నారు. జిల్లా కో కన్వీనర్ యాతాకుల శేఖర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు అక్రమ ఆస్తుల గురించి తీన్మార్ మల్లన్న చేపట్టే 7200 కిలోమీటర్ల పాదయాత్రలో బయటపెడతానని చెప్పిన, మరుక్షణమే ఇలాంటి క్యూ న్యూస్ ఆఫీసుపై దాడులు జరగడం దారుణమన్నారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ మెంబర్లు గంజి వెంకట్, పందుల రవితేజ, మునుగోడు నియోజకవర్గం కన్వీనర్ బొట్ట శివ, పి.పాండు పాల్గొన్నారు.