- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యువతి మిస్సింగ్.. అసలేమైంది?
by Shyam |

X
దిశ, పటాన్‌చెరు: పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో ఓ యువతి మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది. కిరణా షాప్‌లో నిత్యావసర వస్తువులు కొనడానికి వెళ్లిన యువతి ఎంతకీ తిరిగిరాలేదు. దీంతో బాధిత కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. వివరాళ్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన బాబు లాల్ సింగ్ గత 12 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చి పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే, ఇతనికి 17 సంవత్సరాల కూతురు ఉషాకుమారి ఉంది. కాగా, సెప్టెంబర్ 1వ తేదీన సాయంత్రం 4 గంటలకు కిరాణా సామాను తేస్తా అని చెప్పి వెళ్లిన ఉషా కుమారి ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబీకులు చుట్టు పక్కన ఉన్న ఇండ్లు, బంధువుల ఇంట్లో ఆరా తీసిన లాభం లేకుండా పోయింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు.
Next Story