- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూట్యూబ్ లో మరో సరికొత్త ఫీచర్!.. ఇక సుత్తి లేకుండా నేరుగా వీడియోలో మెయిన్ కంటెంట్
దిశ, డైనమిక్ బ్యూరో:యూజర్ ఫ్రెండ్లీగా ఉండేందుకు ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ ఎప్పటికప్పడు కొత్త ఫీచర్లను లను తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనే విషయాలలో కొత్త అప్ డేట్లను అందుబాటులోకి తీసుకువచ్చిన యూట్యూబ్.. తాజాగా తమ వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ‘జంప్ ఎహెడ్’ అనే కొత్త ఏఐ పవర్డ్ ఫీచర్ తీసుకురాబోతున్నదని తెలుస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వీడియోలోని కీలకమైన, అతి ముఖ్యమైన కంటెంట్ భాగాలను తమ యూజర్లు వీక్షించే వెసులుబాటు కలగబోతున్నట్లు తెలుస్తోంది. వినియోగదారుల ప్రవర్తనను అనుసరించడానికి ఫీచర్ మెషీన్ లెర్నింగ్‌ని ఉపయోగించనున్నట్లు టెక్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వీడియో ముగిసే వరకు వేచి ఉండలేని వారికి నేరుగా కంటెంట్ లో ఉన్న హైలైట్‌ల మాత్రమే చూపించేలా ఈ ఫీచర్ డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం డబుల్ ట్యాప్ చేస్తే నేరుగా 10 సెకంట్ల వరకు వీడియోను బ్యాక్, ఫార్వార్డ్ స్కిప్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త ఏఐ- పవర్డ్ టూల్‌తో నేరుగా వీడియోలోని అత్యంత ఆకర్షణీయమైన కంటెంట్ వద్దకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తక్కువ సమయంలో వీడియోలో ఉన్న సారాంశాన్ని వినాలనుకునే యూజర్లకు ఈ ఫీచర్ అద్భుతంగా ఉండబోతున్నదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.