అలర్ట్: ఈ లింక్‌ పట్ల జాగ్రత్త.. క్లిక్ చేశారో.. మీ వాట్సాప్ క్రాష్

by Harish |
అలర్ట్: ఈ లింక్‌ పట్ల జాగ్రత్త.. క్లిక్ చేశారో.. మీ వాట్సాప్ క్రాష్
X

దిశ, వెబ్‌డెస్క్: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది ఆన్‌లైన్‌లో వ్యక్తిగత డేటా చోరీలు కూడా పెరుగుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మోసగాళ్లు దాడి చేస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల వాట్సాప్ గురించి ఒక సమాచారం బయటకు వచ్చింది. ఆన్‌లైన్ చాటింగ్‌లో మొదటి స్థానంలో ఉన్న వాట్సాప్ ద్వారా యూజర్ల డేటాను దొంగలించడానికి హ్యాకర్స్ ఒక బగ్‌ను ఇంజెక్ట్ చేశారు. దీని పట్ల పలువురు యూజర్లు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

యూజర్లు నిర్దిష్ట గ్రూప్ చాట్‌ లింక్ (wa.me/settings) క్లిక్ చేసినప్పుడు ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో వాట్సాప్ క్రాష్ అవుతున్నట్లు తెలుస్తుంది. సాధారణంగా ఈ లింక్ ద్వారా WhatsApp సెట్టింగ్‌ల పేజీని ఓపెన్ కావాలి, కానీ ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ క్రాష్‌ అవుతుంది. వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్ 2.23.10.77లో ఈ సమస్యలు బయటపడ్డాయి.

అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయడం వల్ల వాట్సాప్ క్రాష్ అవుతోందని చాలా మంది వినియోగదారులు పేర్కొన్నారు. అయితే నిపుణులు ఈ సమస్యకు ఒక ప్రత్యామ్నాయం కనిపెట్టారు. వాట్సాప్ వెబ్ బ్రౌజర్ వెర్షన్ ఈ బగ్ బారిన పడలేదు. కాబట్టి బ్రౌజర్ ద్వారా వాట్సాప్ వెబ్‌కు లాగిన్ అయి లింక్‌ను ఉన్న చాట్‌ను డిలీట్‌ చేయమని పేర్కొన్నారు.

Advertisement

Next Story