వామ్మో.. మార్చి నెలలో వాట్సాప్ ఇన్ని ఖాతాలను నిషేధించిందా..!

by Harish |   ( Updated:2023-05-02 12:28:53.0  )
వామ్మో.. మార్చి నెలలో వాట్సాప్ ఇన్ని ఖాతాలను నిషేధించిందా..!
X

దిశ, వెబ్‌డెస్క్: మెసేజింగ్ యాప్ వాట్సాప్ మార్చి నెలలో ఇండియాలో 47 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. వీటిలో కొన్నింటిపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాగా, మరికొన్నింటిని ముందస్తుగానే నిషేధించారు. ఐటీ రూల్స్ 2021 ప్రకారం, కంపెనీ ఈ వివరాలను సోమవారం పేర్కొంది. మార్చి 1- మార్చి 31 మధ్య 47,15,906 ఖాతాలను నిషేధించారు. వీటిలో 16,59,385 ఖాతాలు వినియోగదారుల నుండి ఎటువంటి ముందస్తు నివేదికలు రాకుండానే నిషేధించబడ్డాయి.

వాట్సాప్ పేర్కొన్న వివరాల ప్రకారం, మార్చి నెలలో 4720 అకౌంట్లపై ఫిర్యాదులు రాగా, వాటిలో 535 ఖాతాలపై మాత్రమే చర్యలు తీసుకుంది. మరికొన్ని ఖాతాలపై ఫిర్యాదులు వచ్చినప్పటికి వాటికి సరైన ఆధారాలు చూపకపోవడం వల్ల వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుని వాట్సాప్‌లో అసభ్యకర సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. ఐటీ చట్టం 2021లోని నిబంధనల ప్రకారం, వాట్సాప్ ప్రతినెలా ఖాతాలపై వచ్చిన ఫిర్యాదులు, వాటిపై నిషేధం వివరాలను వెల్లడిస్తుంది.

Advertisement

Next Story