- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆన్‌లైన్ షాపింగ్‌కు బానిలవుతున్నారా.. ఇలా తగ్గించుకోండి..
దిశ, ఫీచర్స్ : మెట్రో నగరాలు, దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ తో సహా ఇతర నగరాల్లో ఆన్‌లైన్ షాపింగ్ క్రేజ్ వేగంగా పెరుగుతోంది. ఈ క్రేజ్ కొన్నిసార్లు సమస్యగా కూడా మారుతుంది. ఎందుకంటే ఆన్‌లైన్ షాపింగ్‌లోని ఆఫర్‌ల ఎర కారణంగా చాలాసార్లు బడ్జెట్ కంటే ఎక్కువ షాపింగ్ చేస్తుంటారు. ఇప్పుడు నిపుణులు ఈ అలవాటును వ్యసనంగా చూస్తున్నారు. ఎందుకంటే ప్రజలు తమ బడ్జెట్‌కు మించి ఆన్‌లైన్ షాపింగ్ చేయడం, వారికి అసలు అవసరం లేని అనేక వస్తువులను కొనుగోలు చేయడం వలన అనేక సార్లు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి.
మితిమీరిన ఆన్‌లైన్ షాపింగ్ చేయడం వల్ల బడ్జెట్ కుంటుపడటమే కాదు నిజంగా అవసరం లేని వస్తువులను కూడా కొంటూ ఉంటారు. ఆ తర్వాత ఈ వస్తువులను చెత్తబుట్టలో వేయవలసి ఉంటుంది. అయితే ఇలా మనీ వేస్ట్ కాకుండా, అనవసర వస్తువులు కొనుగోలు చేయకుండా ఉండేందుకు కొంతమంది నిపుణులు కొన్ని నివారణ చిట్కాలను తెలుపుతున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సైట్‌ల నుండి ఆఫర్‌లు ఒక సమస్య..
ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లు కాలానుగుణంగా ఆఫర్‌ల ప్రకటిస్తూ లాభాలని గడిస్తూ ఉంటారు. కొంతమంది వినియోగదారులు ఈ ఆఫర్లను చూసి అలా అట్రాక్ట్ అయిపోతారు. వాస్తవానికి ఈ సేల్‌లో ఒక ఉత్పత్తి పై తగ్గింపును అందిస్తాయి. అయితే మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసినప్పుడు, మీరు ఒకటి కంటే ఎక్కువ ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లు ప్రయోజనాన్ని పొందుతాయి.
సైకాలజీ కూడా ఒక పెద్ద గేమ్..
పెద్ద నగరాల్లో చాలా మంది శ్రామిక ప్రజలు ఒంటరిగా జీవిస్తుంటారు. ఈ కారణంగా వారు ఆఫీసు తర్వాత ఎక్కువ సమయం ఇంటర్నెట్‌లో గడుపుతాడు. ఈ సమయంలో చాలా మంది ఆన్‌లైన్ సైట్‌లలో షాపింగ్ చేస్తూ ఆనందాన్ని పొందుతారు. కొంత కాలం తర్వాత ఇది అలవాటుగా మారిపోతుంది. దీంతో ఎప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ చేసినా వారి మెదడులో ఆనందం ఇచ్చే హార్మోన్ విడుదల అవుతుంది.
అయితే ఇలాంటి అలవాట్లను మార్చుకునేందుకు చాలా దేశాల్లో నో స్పెండ్ ఛాలెంజ్ ప్రారంభించారు. ఇందులో వారానికి కనీసం ఒక రోజు షాపింగ్ చేయకూడదనే నిబంధన ఉంటుంది. ఈ నియమం ప్రకారం వారంలో ఒకరోజు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఎలాంటి షాపింగ్ చేయకూడదు.
ఆన్‌లైన్ షాపింగ్ మానేసేందుకు ఈ చిట్కాలు యూస్ ఫుల్..
షాపింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, సైట్‌లకు దూరంగా ఉండాలి. అలాగే సోషల్ మీడియా, టీవీలో కొత్త ప్రోడక్ట్ రివ్యూలు, షాపింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు వంటి వాటిని అవైడ్ చేయాలి.
ఖర్చులు తగ్గించడం ద్వారా వారానికి రూ.500 నుంచి 5 వేలు ఆదా చేసుకోవచ్చు. ఖర్చులను లెక్క వేసుకుంటే ఆన్‌లైన్ షాపింగ్ అలవాటుకు చెక్ పెట్టొచ్చు.
సేవింగ్స్ నుంచి ఖర్చు చేయడం మానుకోవాలి. పెద్ద సమస్య తలెత్తితే తప్ప సేవింగ్స్ అమౌంట్ ను తీయకూడదు.
ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ కి సంబంధించిన వస్తువులను ఇంట్లో నే చేసుకునే నైపుణ్యాలను నేర్చుకోవాలి.
బోర్ ఫీల్ అయినప్పుడు షాపింగ్ యాప్స్ చూడడం కాకుండా ఏవైనా వీడియోస్, రీల్స్ వంటివి చూస్తే సమయం గడిపేయాలి. లేదా ఏవైనా మంచి పుస్తకాలను చదవాలి.