- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Earth End : 2032లో అంతం కానున్న భూమి! ఆందోళనలో శాస్త్రవేత్తలు

దిశ, వెబ్ డెస్క్ : 2032లో భూమి అంతం(Earth End) అయ్యే అవకాశాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. భూమి వైపు దూసుకు వస్తున్న ఓ భారీ గ్రహశకలం(Asteroid).. దాని దారి మళ్లింపు జరగకపోతే 2032లో అది నేరుగా భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని వారు తెలియజేస్తున్నారు. అంతరిక్ష శాస్త్రవేత్తలు కొన్ని వారాల క్రితమే ఓ భారీ గ్రహాశకలాన్ని కనుక్కున్నారు. దానికి 2024 YR4(2024 YR4) అనే పేరు పెట్టారు. అయితే దాని గురించి మరిన్ని వివరాలు కనుక్కునే పనిలో భాగంగా పలు సంచలన విషయాలు తెలుసుకున్నారు. అది ప్రయాణించే దిశ దాదాపుగా భూమివైపే ఉందని తెలుసుకొని షాక్ అయ్యారు. 300 మీటర్ల వ్యాసం గల ఆ ఆస్టరాయిడ్ ప్రయాణ దిశ, వేగాన్ని అంచనా వేయగా.. 2032 డిసెంబర్ 22వ తేదీన భూమిని ఢీకొనే అవకాశం 5 శాతం మేర ఉందని పేర్కొన్నారు. అయితే.. అది ఖచ్చితంగా భూమిని ఏ ప్రాంతంలో ఢీకొంటుందో మాత్రం తెలుపలేదు.
అత్యంత శక్తివంతమమైన టెలిస్కోప్ ద్వారా ఆ గ్రహశకలంపై మరింత ఫోకస్ చేస్తోంది నాసా(NASA). ఆ గ్రహశకల కక్ష్యను, వేగాన్ని అంచనా వేసే పనిలో దిగింది. అది భూమిని ఢీ కొనకుండా దాని కక్ష్యను దారి మళ్లించే ప్రయత్నాలు చేస్తోంది. నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో మార్చి 2025 నుంచి ఆ గ్రహశకలాన్ని పరిశీలించి దాని స్పష్టమైన పరిణామం, ప్రభావంపై ఓ క్లారిటీకి రానుంది. ఇక నాసా సెంటర్ ఫర్ నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ నిర్వహించే గ్రహశకల ప్రమాద జాబితాలో ఈ ఆస్టరాయిడ్ ను కూడా చేర్చింది. అయితే ఈ గ్రహశకలం భూమిని ఢీకొనకుండా దారి మళ్ళిస్తామని నాసా ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇక 2012లో జరిగిన భూమి అంతం అనే వదంతిని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. మయన్ నాగరికతలోని 5,126 ఏళ్లు గల క్యాలెండర్ ప్రకారం 2012 డిసెంబర్ తో ఆ క్యాలెండర్ పూర్తి అవుతుందని.. అప్పుడు ప్రపంచం కూడా అంతం అవుతుందని ప్రపంచం భయంతో వణికి పోయింది. దీనిపై పలు సినిమాలు కూడా విడుదలయ్యి కోట్లు కొల్లగొట్టాయి. ఇక వార్తా సంస్థలు, ఛానెల్స్ ఆ విషయానికి బోలెడు మసాలా కలిపి వార్తలు వండి పెట్టాయి. తీరా 2012 డిసెంబర్లో అలాంటిది ఏమీ జగరలేదు సరికదా.. క్యాలెండర్ పూర్తయితే మళ్ళీ రిపీట్ అవుతుందిలె అనే కార్టూన్స్, జోక్స్ విపరీతంగా ప్రచారం అయ్యాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలు చెబుతున్న భూమి అంతం థియరీ కూడా కొద్దిమంది తేలిగ్గా తీసుకుంటున్నా.. అనేకమంది ఎలాగైనా ఆ గ్రహశకలం దారి మళ్ళాలి అని ప్రార్థనలు చేస్తున్నారు.