- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డెస్క్‌టాప్‌లో వాట్సాప్ వాడతున్న వారికి భారీ గుడ్‌న్యూస్.. తీరనున్న సమస్య!

దిశ, వెబ్‌డెస్క్: మెసేజింగ్ దిగ్గజ యాప్ వాట్సాప్ తాజాగా మరో హై లెవల్ సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకువస్తుంది. వాట్సాప్ వెబ్‌లో కొత్తగా ‘స్క్రీన్ లాక్’ ఫీచర్‌ను విడుదల చేస్తుంది. డెస్క్‌టాప్ వాట్సాప్ వెబ్‌లో మెసేంజర్ హోమ్ స్క్రీన్‌ను ఇతరులకు కనిపించకుండా లాక్ చేయడానికి అనుమతించే కొత్త ఫీచర్‌ను కంపెనీ విడుదల చేస్తుంది.
సాధారణంగా వాట్సాప్ వెబ్‌లో లాగిన్ అయిన తరువాత కాసేపు వాట్సాప్‌ను వాడకుండా ఉన్నప్పుడు కూడా అది లాగిన్‌లోనే ఉంటుంది, యూజర్లు లాగ్ అవుట్ చేసే వరకు కూడా అలాగే ఉంటుంది. ఈ టైంలో ఇతరులు మెసేజ్‌లను చూసే అవకాశం ఉంది, కాబట్టి యూజర్ల చాటింగ్‌ను ఇతరులు చూడకుండా ఉండటానికి స్క్రీన్ లాక్ ఫీచర్‌ను తెచ్చారు. స్క్రీన్ లాక్‌ను సెట్ చేసుకోవడం ద్వారా చాటింగ్ ఇతరులకు కనిపించకుండా చేయవచ్చు.
ఒకవేళ యూజర్లు తిరిగి వెబ్ వాట్సాప్‌ను వాడాలనుకుంటే పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేస్తే సరిపోద్ది. ప్రతిసారి లాగ్ అవుట్ చేసి మళ్లీ QR కోడ్‌ని స్కాన్ చేసి లాగిన్ అవ్వాల్సిన పరిస్థితి ఉండదు. యూజర్లు పాస్‌వర్డ్ ఎంటర్ చేయకుండా వెబ్ వాట్సాప్‌ను ఓపెన్ చేయలేరు. దీని కారణంగా యూజర్ల చాటింగ్ అంత కూడా భద్రంగా ఉంటుందని WABetaInfo పేర్కొంది. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం WhatsApp వెబ్ బీటాతాజా వెర్షన్‌ని ఉపయోగించే కొంతమంది వినియోగదారులకు అందుబాటులో ఉంది. త్వరలో మిగతా యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.